అనన్య న్యూస్, మహబూబ్ నగర్:సామాజిక మాధ్యమాలను దుర్వినియోగ పరుస్తూ ప్రజల్లో విద్వేషాలను సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
వివిధ వర్గాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో కొందరు విదేశాల్లో ఉంటున్న వారు తమపై ఎలాంటి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని భ్రమలో ఉండి సోషల్ మీడియాలో ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం దృష్టికి వస్తున్నాయి. పోలీసు శాఖకు ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సోషల్ మీడియా సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అట్టి నేరానికి పాల్పడిన సంబంధిత వ్యక్తులపై, సమూహంపై కేసును నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. కేసులు నమోదైతే వారికి జారీ కాబడిన పాస్ పోర్ట్ లు, వీసాలు రద్దు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కేసులు నమోదైన వారికి పాస్ పోర్టులు రద్దు చేయబడిన వారికి మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పోర్టులు జారీ కావని అన్నారు. మరికొందరు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వివిధ మతాలకు చెందిన వారి విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మత విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండే పోస్టులు పెట్టి ఎక్కడో జరిగిన సంఘటనలను వక్రీకరిస్తూ ఊహాజనితమైన పోస్టులు పెట్టడం కూడ నేరమని పేర్కొంటున్నాము. సోషల్ మీడియాను వేదికగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన విమర్శలు దూషణలు చేసిన, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ వివిధ వర్గాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే చర్యలకు పాల్పడే వారిపై నమోదైన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగించి నిందితులకు త్వరితగతన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన నేరస్తులపై హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి, ఇట్ యాక్ట్, పిడి చట్టం నమోదుకు అవకాశము ఉందని తెలిపారు.
సామాజిక మాధ్యమానీ దుర్వినియోగపరిస్తే చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ నరసింహ..
RELATED ARTICLES