అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది ఏళ్లలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం కెసిఆర్ ముందు చూపుతో రైతు సంక్షేమ రాజ్యంగా తెలంగాణ విరాజిల్లుతున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జడ్చర్ల మండల పరిధిలోని నసరుల్లబాద్ గ్రామంలో శనివారం నిర్వహించిన రైతు సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, రైతు బంధు సమితిలు, అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంట కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ లాంటి ఎన్నో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం స్వరూపమే సమూలంగా మారిపోయిందన్నారు.
ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని. ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని అన్నారు. తెలంగాణలో విజయవంతమైన వ్యవసాయ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయటం ద్వారా అద్భుత ఫలితాలు సాధించగలమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు ఎల ఉంది అని ప్రజలు చర్చించుకోవలని అన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించి వారికి మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్ తదితరులు పాల్గొన్నారు.