- జడ్చర్లలోని మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ పరిశీన
- మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం
- జడ్చర్ల లో కొత్తగా మాడ్రన్ ధోబి ఘాట్, స్మశానవాటిక మంజూరు
జడ్చర్ల, అనన్య న్యూస్: రానున్న వేసవికాలం దృష్ట్యా జడ్చర్ల మున్సిపాలిటీలో, గ్రామాల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం జడ్చర్ల పందిరిగుట్ట మిషన్ భగీరథ వాటర్ ప్లాంటు ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారులు (ఇంట్ర, గ్రిడ్), మున్సిపల్ అధికారులతో స్థానిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ రానున్న వేసవిలో నియోజకవర్గంలో ఎక్కడ తాగు నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు.
జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతీ ఇంటికి తప్పనిసరిగా నల్లా కలెక్షన్ అందజేసి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో అక్కడక్కడా జరగవలసిన ఇంట్రా పైపు లైన్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా విధానాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మున్సిపాలిటీలో తాగునీరు సరఫరాకు నిర్దిష్టమైన సమయం కేటాయించాలని సూచించారు. పట్టణంలో, గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సమస్య ఉంటే వెంటనే మున్సిపల్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని విచారించారు. కాంట్రాక్టర్లు వారికి అలౌట్మెంట్ అయిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
జడ్చర్ల పట్టణంలో కొత్తగా స్మశానవాటిక, రూ.2.00 కోట్లతో మోడ్రన్ ధోబి ఘాట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు, నాయకులు రవీందర్, రామ్మోహన్ తదితరులు ఉన్నారు.