అనన్య న్యూస్, వికారాబాద్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పోవటం వల్లే కేంద్ర నిర్ణయం మార్చుకుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గురువారం హరీష్ రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు గురించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నేను మాట్లాడడం జరిగిందని, సీఎం కేసీఆర్ పోరాటంతోనే కేంద్రం నిర్ణయంలో మార్పు వచ్చి విశాఖ ఉక్కును అమ్మ బొమ్మని, బలోపేతం చేస్తామని ప్రకటించిందన్నారు. విశాఖ ఉక్కు పై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదని హరీష్ రావు గుర్తు చేశారు. ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం చేసిందని, విశాఖ ఉక్కు ప్లాంట్ విషయంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇది సీఎం కేసీఆర్, బిఆర్ఎస్, ఏపీ ప్రజల, విశాఖ కార్మికుల విజయం అని మంత్రి హరీష్ రావు తెలిపారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కెసిఆర్ పోరాటం వల్లే కేంద్రం నిర్ణయంలో మార్పు: మంత్రి హరీష్ రావు
RELATED ARTICLES