- మంచి పనితీరు ఉన్న పార్టీ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు దక్కుతాయి.
అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు బిఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ భీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో గురువారం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు. మంచి ప్రవర్తన ఉన్న ఎమ్మెల్యేల అందరికీ సీట్లు దక్కుతాయని, వెనుకబడిన ఎమ్మెల్యేలు తమ ప్రవర్తనను మెరుగుపరుచుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, విద్య, వైద్య రంగాల్లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చామన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం అవుతారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దమ్ముంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు.
అమెరికా పర్యటనతో తెలంగాణకు 42వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని కోల్పోతుందన్నారు. దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీనే కారణమన్నారు. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు. ఓ వైపు ఒవైసీ తమపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు బాగున్నాయంటున్నారు. డీ లిమిటేషన్‌పై అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కేటీఆర్ అన్నారు.