రాజన్న సిరిసిల్ల, అనన్య న్యూస్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాన్వాయ్ లో 6 వాహనాలు ఒక దాని కొకటి ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో వాహనాలు ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శనివారం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయలుదేరే క్రమంలో తిమ్మాపూర్ వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో రేవంత్ రెడ్డి తో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.