అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ 2 కే రన్ నిర్వహించారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ 2కే రన్ కార్యక్రమం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా నుండి జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన వరకు కొనసాగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు.
ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చివరి పాయింట్ కు ముందుగా చేరుకున్న వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పతాకాలు, మెమెంటోలు అందజేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, ఎంఈఓ మంజులాదేవి, సీఐలు రమేష్ బాబు, జములప్ప, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, నాయకులు దోరేపల్లి రవీందర్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.