- మహిళల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం
- మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
- ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
- జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, అనన్య న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సారధ్యంలో ఎనలేని కృషి చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జడ్చర్ల మహిళలకు ఉచితంగా క్యాన్సర్ రోగనిర్ధారణ పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాతృ సంస్థ అయిన సిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో నిష్ణాతులైన వైద్యుల సమక్షంలో బుధవారం జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు సమైక్యంగా సమన్వయంతో ఉంటేనే తమ హక్కుల సాధనకు మార్గం ఏర్పడుతుందని, సీఎం కేసీఆర్ ప్రతిరంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారని , మహిళల ప్రగతికి ప్రభుత్వ మానేయక చర్యలు తీసుకుంటుందని అన్నారు. క్యాన్సర్ అనేది మందులేని జబ్బు కాదని ముందస్తుగా గుర్తిస్తే తప్పనిసరిగా అరికట్ట గలుగుతామని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఆరోగ్య రక్షణకు జడ్చర్ల నియోజకవర్గ మహిళలకు ఉచితంగా కాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు సిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశామని మహిళలు సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవగాహనతోనే క్యాన్సర్ వ్యాధిని అడ్డుకట్ట వేయగలుగుతామని ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సారిక, కౌన్సిలర్లు పుష్పలత, జ్యోతి రెడ్డి, శ్రీశైలమ్మ, లత, ఉమాదేవి, నవనీత, శ్రావణి, నందకిషోర్ గౌడ్, సతీష్, సుంకసారి రమేష్, ఉమా శంకర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ముడా డైరెక్టర్లు రవిశంకర్, శ్రీకాంత్, ప్రీతమ్, ఇమ్ము, ఏఎంసీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మహిళా నాయకురాలు రేణుక, లక్ష్మి, నాయకులు పిట్టల మురళి, బికేఆర్, యూపీహెచ్సీ డాక్టర్ శివకాంత్ తదితరులు పాల్గొన్నారు.