పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట, జడ్చర్లలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కావేరమ్మపేట గ్రంథాలయం దగ్గర ఏర్పాటు చేస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కావేరమ్మపేట రోడ్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేస్తున్న బొడ్రాయి కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేసే బొడ్రాయి తో స్థానిక ప్రజలకు సాంత్వన లభిస్తుందని అన్నారు.
అనంతరం గ్రామస్తులతో కలిసి మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాలలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు బుక్క మహేష్, చైతన్య చౌహన్, జ్యోతి రెడ్డి, కుమ్మరి రాజు, లత, శశికిరణ్, విజయ్, నాయకులు దోరేపల్లి రవీందర్, రామ్మోహన్, షేక్ బాబా, బికేఆర్, రాజాపూర్ మండల నాయకులు అభిమన్యు రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పోల వినోద్, బొడ్రాయి ప్రతిష్టాపన నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.