Friday, March 14, 2025

బాస్ పార్టీ బ్యూటీ ఊర్వశీ రౌతేలాతో అఖిల్ మాస్ పాట..

అనన్య న్యూస్: వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్‌ ఈజ్‌ ద పార్టీ బాసూ వేర్‌ ఈజ్‌ ద పార్టీ అంటూ మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ పాట సూపర్ హిట్‌ అవ్వడంతో ఊర్వశికి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రత్యేక పాటల కోసం దర్శకులు ఆమె వైపే చూస్తున్నారు. పోతినేని రామ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రంలో ఆమె ఐటమ్ సాంగ్ లో నర్తించనుంది. ఇప్పుడు ఆమెను మరో ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్‌’ చిత్రంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఓ ప్రత్యేక పాట తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ తో కలిసి ఊర్వశి కాలు కదిపింది. ఇది మాస్ ట్యూన్ లో వచ్చే జానపద గేయం అని తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 28న ‘ఏజెంట్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular