అనన్య న్యూస్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చేసిన ప్రమాణం, సవాల్ పై ఈటెల రాజేందర్ స్పందించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడినట్లు ఈటెల తెలిపారు. ఒక రాజకీయ నాయకునికి కావాల్సింది కాన్ఫిడెంట్ అని, నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం, అమ్మతోడు, అయ్యతోడు అనడం ఏమిటన్నారు. తాను కూడా ఆత్మ సాక్షిగా మాట్లాడుతున్నానని అన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ఇప్పుడున్న రాజకీయాలపై నేను మాట్లాడిన, ఎవరెన్ని మాట్లాడిన ప్రజల కోసం ఈటల రాజేందర్ పోరాటం చేస్తాడని అన్నారు. నేను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు.