అనన్య న్యూస్: మహబూబ్ నగర్, విశాఖటప్నం ఎక్స్ప్రెస్ రైలు శనివారం పట్టాలెక్కనుంది. ఇప్పటి వరకు కాచిగూడ-విశాఖపట్నం మధ్య నడిస్తున్న ఈ రైలును మహబూబ్ నగర్ వరకు పొడగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రైలును ప్రారంభించనున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శనివారం మహబూబ్నగర్ స్టేషన్లో రైలు (నం.12862)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. మహబూబ్నగర్ నుంచి ఏపీలోని కోస్తా జిల్లాలు, విశాఖపట్నంతో కనెక్ట్ అవుతున్న తొలిరైలు ఇదే కావడం విశేషం.
ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మహబూబ్నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ట్రైన్ నంబర్ 12861/12862 రైలును మహబూబ్నగర్ వరకు నడుపుతుండడంతో మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, ఉందానగర్ ప్రజలకు మేలు జరగనుంది. ఈ రోజు నుంచి ఈ రైలుకు సంబంధించి కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది. కాచిగూడ తర్వాత ఈ రైలు ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్ స్టేషన్లలో ఆగుతుంది.