అనన్య న్యూస్, హైదరాబాద్: ఇటీవలే కురిసిన వర్షానికి హైదరాబాద్ లోని కళాసిగూడలో ఓ చిన్నారి నాలాలో పడి మృతిచెందిన ఘటన మరువక ముందే.. నగరంలో మరో విషాద ఘటన జరిగింది. తాజాగా మంగళవారం నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్ మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. మంగళవారం నగరంలోని జూబ్లీహిల్స్ లో గల రోడ్ నెం.45లో ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. వివేక్ మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విషాద ఘటనపై ఆరా తీస్తున్నారు. బతుకుదెరువు కోసం వివేక్ ఫ్యామిలీ ఏడేళ్ల క్రితం కాకినాడ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చింది. బాబు తండ్రి భీమా శంకర్ బంజారాహీల్స్ లోని ఓ బైక్ షోరూం వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.