- బండి సంజయ్, రేవంత్ రెడ్డి లకు షర్మిల ఫోన్
అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదాంమని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల బండి సంజయ్, రేవంత్ రెడ్డి లను కోరారు.శనివారం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ చేసి నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదాంమని కోరారు. ఉమ్మడి కార్యచరణ చేద్దామని తెలిపిన షర్మిల ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో బ్రతకనీయరని షర్మిల అన్నారు. షర్మిల కు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశం అవుదామని తెలిపారని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి బదులిచ్చారని అన్నారు.