అనన్య న్యూస్, అమరావతి: దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ హాజరయ్యారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక తదితరంగాల్లో అపార జ్ఞానశీలి, దేశ రాజకీయ ప్రజాస్వామ్య సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి, వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత, బేద భావాలు మరిచేలా మానవత్వం పరిడ్డవిల్లెల ఆయన చేసిన కృషి మరువలేమన్నారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రిక అడుగులు ముందుకు వేశామని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్: సీఎం జగన్
RELATED ARTICLES