- ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
అనన్య న్యూస్, జడ్చర్ల: రాష్ట్ర ఏర్పాటు తర్వాతే తెలంగాణ సాంప్రదాయ పండుగలైన బోనాలు, బొడ్రాయి పంటి పండుగలకు ప్రాధాన్యత లభిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల, కావేరమ్మ పేటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు శుక్రవారం మూడవరోజు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి సామరస్యంగా పండుగలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సారిక, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.