అనన్య న్యూస్: తెలంగాణ ప్రజలకు వైకాపా నాయకులు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై రెండు రాష్ట్రాల మంత్రులకు మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడగా అందుకు మంత్రి హరీష్‌రావు కూడా వారికి సరైన రీతిలో ఘాటుగా సమాధానం చెప్పారు. అయితే తెలంగాణ మంత్రి హరీష్‌రావుతో పాటు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు ఉన్నాయంటూ సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపారు.
తెలంగాణ ప్రజలకు వైకాపా క్షమాపణ చెప్పాలి: పవన్ కల్యాణ్
RELATED ARTICLES