అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్. మద్యం ధరలను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగ్గిన మద్యం ధరలు నేటి నుండి అంటే శుక్రవారం నుండే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు తగ్గాయి. క్వార్టర్ పైన రూ.10, హాఫ్ పైన రూ.20, ఫుల్ పైన రూ.40 వరకు తగ్గుతున్నాయి..