రెండవ రోజు విశేష పూజలు
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట, జడ్చర్లలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. కావేరమ్మ పేట గ్రంథాలయం దగ్గర ఏర్పాటు చేస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన, కావేరమ్మ పేట రోడ్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలలో భాగంగా గురువారం ఉదయం ప్రాతకాల పూజలు, మంటప దేవత పూజ, ఆవాహిత దేవత మూలమంత్ర అవవానం, మంగళ హారతులు, చండీ హోమం, రుద్ర హోమం, నవగ్రహా హోమం, లక్ష్మీ గణపతి హోమం, మండప దేవత హోమం, తదుపరి ఆశీర్వచనం నిర్వహించారు.
సాయంకాలం పూజ విశేషాలు ప్రదోషకాల పూజ బొడ్రాయికి మహాస్నపనము, దాన్యాదివాస, శయాధివాస, పల పుష్పాది వాసము, మంగళ హారతులు, అమ్మవారికి స్వస్తి వచనాలు, మంత్రపుష్పం అనంతరం ప్రసాద వితరణ చేశారు. హోమ కార్యక్రమాలలో గుండు విజయ్ దంపతులు, మహేష్ గౌడ్ దంపతులు, బుక్క వెంకటేష్ దంపతులు, రుమాండ్ల పర్వతాలు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘరామంలోని మహిళలు కలశాలలో తీసుకొచ్చిన నీటితో బొడ్రాయికి అభిషేకం నిర్వహించారు. కార్యక్రమాలలో బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ సభ్యులు బుక్క చెన్నయ్య, గుండు మురళి, లక్ష్మయ్య, గోనెల శంకర్, పర్వతాలు, కాశీ విశ్వనాథం, వెంకటయ్య, నాగరాజు, నవీన్, శివకుమార్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.