అనన్య న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇటివల కాలంలో మహారాష్ట్ర కు చెందిన నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కాగా, హారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ మూడు బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. నాందేడ్, కంధార్ లోహా, ఔరంగాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలు విజయవంతం అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బిఆర్ఎస్ లోకి వలసలు జోరందుకున్నాయి.
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నాయకులు
RELATED ARTICLES