అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో నూతనంగా నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా (బొడ్రాయి) నాభిశిల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కావేరమ్మపేట చౌరస్తా గ్రంథాలయం సమీపంలో గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై గ్రామ పెద్దలు, గ్రామస్తులతో కలిసి నాభిశిల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆలోచన మేరకు గ్రామంలో పెద్ద ఎత్తున బొడ్రాయి పండుగ నిర్వహించడం ఆనందనీయమని, బొడ్రాయి పండుగను గ్రామస్తులు అంతా కలిసికట్టుగా నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేష్, కుమ్మరి రాజు, నాయకులు పాలది రామ్మోహన్, షేక్ బాబా, కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, చెన్నయ్య, పర్వతాలు, మురళి, కాశీ విశ్వనాథం, సత్యనారాయణ, వినోద్, యాదయ్య, నాగరాజు, రాములు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట, జడ్చర్లలో ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు జరగనున్నాయి.