అనన్య న్యూస్, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తున్నది. ఈ పథకానికి ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఆ మొత్తం నిధులను మొదటి త్రైమాసికం విడతలోనే విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 12 లక్షల 469 మంది ఆడబిడ్డలకు రూ.10,410 కోట్లను సీఎం కేసీఆర్ మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. ఈ బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క కల్యాణలక్ష్మి కోసమే ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. ఆ మొత్తాన్ని ఒకే పద్దులో ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. గత ఏడాది కంటే ఈసారి కల్యాణలక్ష్మి పథకానికి రూ.150 కోట్లను అదనంగా కేటాయించింది. నిరుడు రూ.1,850 కోట్లను ఒకేసారి విడుదల చేయడం విశేషం..
కల్యాణలక్ష్మికి 2000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
RELATED ARTICLES