జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, అనన్య న్యూస్: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 8వ తేదీ బుధవారం నియోజకవర్గ మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరుగు తుందని హైదరాబాద్ కు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహించే శిబిరంలో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మహిళలు, నియోజకవర్గ మహిళలు పాల్గొని అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు చేయించుకొని చికిత్సను తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్ రవిశంకర్ తదితరులు ఉన్నారు.