- భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి
అనన్య న్యూస్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్, బీజేపీ భారీగా డబ్బు ఖర్చు చేశాయని. తాను ఏ పార్టీ వద్ద నుంచి ఎలాంటి డబ్బు స్వీకరించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను అమ్మవారిని నమ్ముతాను ముఖ్యంగా మునుగోడు ఎన్నికల సందర్భంగా తాను బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నట్టు ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ మునుగోడులో రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని, పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి కూడా పంచకుండా ప్రజా తీర్పు కోరింది. గతంలో ఆమె విసిరిన సవాల్ బీఆర్ఎస్, బీజేపీలు ఎందుకు స్పందించలేదన్నారు. ఒక్క రూపాయి కూడా పంచకున్నా పాల్వాయి స్రవంతికి పాతికవేల ఓట్లు వచ్చాయని.. నిజాయితీగా 25వేల మంది కాంగ్రెస్ వెంట నిలిచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అమ్మవారి కండువా వేసుకొని ప్రమాణం చేస్తున్నఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్ విసురుతున్న, కేసీఆర్ సాయం పొందిం మేమే సర్వనాశనం అవుతాం. నేను చెప్పింది అబద్ధం అయితే సర్వనాశనమైపోతాను. ఆధారాలు లేనప్పుడు దేవుడిపై ఆధారపడతాం. గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్ తో ఎలాంటి లాలూచి లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్ తో పోరాడుతాను. ఈటల నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఆలోచించి మాట్లాడాలని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ వ్యతిరేక గొంతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ఈటలను రేవంత్ ప్రశ్నించారు. నీ వైఖరి తెలంగాణ సమాజానికి నష్టం అంటూ మండి పడ్డారు. ఈ నేపథ్యంలో రేవత్ రెడ్డి ఆవేదనకు గురై కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ తో కొట్లాడు తున్నప్పుడు నువ్వు కేసీఆర్ పక్కన సాక్షిగా నువ్వే కదా ఉన్నదని ఈటలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఈటల పట్ల తనకు సానుభూతి ఉండేదని. కేసీఆర్ కక్ష కట్టినప్పుడు ఈటల తరుపున సానుభూతిగా నిలబడ్డామని. ఇది నా మనోవేదన అని ఈటల అర్థం చేసుకో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పోరాటం చేస్తున్న మమ్ముల్ని అమ్ముడు పోయావని అంటావా అంటూ రేవంత్ కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్ సర్వం ధార పోసిన తనను కొనలేడని పేర్కొన్నారు. తనది చిల్లర రాజకీయం కాదని పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు.