అమరావతి, అనన్య న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. 2023-24 వార్షిక బడ్జెట్‌లో భాగంగా సంక్షేమానికి పెద్ద పీట వీసింది. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్షంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. ఇక బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. వార్షిక బడ్జెట్ లో ఆరోగ్యం, వైద్యం, విద్య కుటుంబ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద ప్రజలు, బలహీన వర్గాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత, విద్యా, వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రభుత్వం వరాల జల్లు.. వార్షిక బడ్జెట్ లో వైద్యం, విద్య, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం..
RELATED ARTICLES