అనన్య న్యూస్, జడ్చర్ల: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడమే లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు, 20వ వార్డులలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చెప్పటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలనే ఉదేశ్యంతోనే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ అర్హులను గుర్తిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తాహాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్ చైతన్య, నాయకులు దోరేపల్లి రవీందర్, పిట్టల మురళి, పరమటయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES