అనన్య న్యూస్, నవాబుపేట్: అబద్ధాలే పునాదిగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం నవాబుపేట్ మండలంలోని 10 గ్రామాలకు సంబంధించి సుమారు 3 వేల మందితో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలసి వనబోజననికి వచ్చిన విదంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపారని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమలు తెలంగాణ లో అమలు చేస్తున్నారని అన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కీలక మన్నారు. నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందచేత:
అంతకు ముందు కొద్ది రోజుల క్రితం నవాబుపేట్ మండలంలోని కాకర్లపాడ్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య ప్రమాదవశాత్తు మరణించగా అతని కుటుంబానికి ఆసరాగా బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ నుండి మంజూరైన 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అతని కుటుంబ సభ్యులకు అందచేశారు. కార్యక్రమంలో జిసిసి చైర్మన్ వాల్యా నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.