అనన్య న్యూస్, హైదరాబాద్: కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6:15 గంటల వరకు కొనసాగింది. దాదాపు మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధి తీరుతెన్నును ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.