Monday, March 24, 2025

Summer Safety For Childrens: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • జలపాతాలు, చెరువులు, వాగులు సందర్శించే ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పు..
  • పిల్లల ప్రాణాలను తీస్తున్న ఈత..
  • తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త..
  • సెలవుల్లో పిల్లలపై కన్నేసి ఉంచండి..

అనన్య న్యూస్: పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్న సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గ్రహించండి.

పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు పాటిద్దాం:

  • పిల్లలను బావుల్లో, అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి.
  • అవసరమైతే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్లండి.
  • మోటార్‌సైకిల్ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి.
  • మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు వారి చేతికి ఇవ్వకండి.
  • స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి
  • మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి.
  • ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకోవడానికి వారికి అనుమతినివ్వండి.
  • ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి.
  • వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని మన సంప్రదాయాలను నేర్పించాలి.
  • సంప్రదాయ పనులు గురించి వారికి చెప్పాలి.
  • ఇలా జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి..
Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular