అనన్య న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి రావాలని గురువారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహ్వానంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సహా ఎవరూ బీజేపీని వీడరని, బీజేపీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఈటల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బయటకు పంపిన నాడు తనకు బీజేపీ గౌరవం, ధైర్యం ఇచ్చిందని ఈటల వెల్లడించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ సీనియర్ నేతలే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ను ఓడించగలిగే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని, క్షణికావేశంతో కాదు. ఆలోచనతో మాత్రమే బీజేపీలో చేరామని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ క్యారెక్టర్ తెరిచిన పుస్తకమని స్పష్టం చేశారు.