అనన్య న్యూస్: భారత దేశంలో తొలి అధికారిక యాపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ అయింది. మంగళవారం ముంబైలో యాపిల్ బీకేసీ స్టోర్ ను సీఈవో టీమ్ కుక్ ఘనంగా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ డోర్లు ఓపెన్ చేసి కస్టమర్లకు స్వాగతం పలికారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో యాపిల్ స్టోర్ ఉంది. 22 వేల చదరపు విస్తీర్ణంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. లాస్‌ఎంజెల్స్, న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ వంటి నగరాల తర్వాత ముంబైలో ఏర్పాటు చేసిన యాపిల్ ఐ-ఫోన్ రిటైల్ స్టోర్‌ను టీమ్ కుక్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ముంబై తొలి యాపిల్ స్టోర్ ను ఓపెన్ చేసిన టీమ్ కుక్ ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీలోనూ రెండో యాపిల్ రిటైల్ స్టోర్‌ను లాంఛ్ చేయనున్నారు. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఢిల్లీలో ఏర్పాటు కానున్న ఈ స్టోర్ సైతం దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.