జడ్చర్ల, అనన్య న్యూస్: మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బి.ఆర్.అర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడెమీ హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లు తమ క్షేత్ర పర్యటనలో భాగంగా గార్డెన్ ను సందర్శించారు. గార్డెన్ సమన్వయ కర్త డా. బి. సదాశివయ్య వారికి స్వాగతం పలికారు. అనంతరం గార్డెన్ లోని వివిధ విభాగాలను చూయించి అందులోని మొక్కలను వివరించారు. నెట్ హౌస్ లో పెంచున్న జాతులను సైతం చూపించి వివరించారు. అనంతరం తెలంగాణ స్టేట్ హెర్బేరియం ను సందర్శించి అక్కడున్న మొక్కల నమూనా లను పరిశీలించారు. రీసెర్చ్ ల్యాబ్ లో భద్రపరచబడిన పాముల గురించి వివరించారు. ఫారెస్ట్ అకాడెమీ డిప్యూటీ డైరెక్టర్ అంజనేయులు సారధ్యంలో శిక్షణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ గార్డెన్ ను సందర్శించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ పర్యటన మాకు ఉద్యోగరీత ఎంతో అవగాహనను కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు రామకృష్ణ, శంకర్, ఉదయ్, రమాదేవి తదితరులు ఉన్నారు..
బొటానికల్ గార్డెన్ ను సందర్శించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్..
RELATED ARTICLES