అనన్య న్యూస్, ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ పార్టీ ముఖ్య నేతలు అరుణ్ సింగ్, లక్ష్మణ్ సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ కు అధికారికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బిజెపిలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1952 నుంచి మా కుటుంబం కాంగ్రెస్ లోనే ఉందని, కాంగ్రెస్ ను విడుతానని ఏనాడు అనుకోలేదు అన్నారు. ఇక బిజెపిలో ప్రధాని మోడీ, అమిత్ షా ల పరిపాలన బాగుందని అందుకే బిజెపిలోకి చేరానని అన్నారు. ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి చేరికను స్వాగతించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ లో ఇక బిజెపి బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.