- జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య
- మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి
జడ్చర్ల, అనన్య న్యూస్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బండి సంజయ్ ని వెంటనే అరెస్టు చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మహిళా అనే గౌరవం లేకుండా ఎమ్మెల్సీ కవితపై అనుచితక వాక్యాలు చేయడం మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శనివారం జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కవితను అవమానించిన బండి సంజయ్ ని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల సిఐ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితపై బిజెపి పార్టీ కక్షపూరత ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు కొంగలి జంగయ్య, మూడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇమ్ము, కౌన్సిలర్లు జ్యోతి రెడ్డి, చైతన్య, లత, సుంకసారి రమేష్, సతీష్, శశికిరణ్, శంకర్, ఉమా శంకర్ గౌడ్, మండల యువత అధ్యక్షులు వీరేష్, నాయకులు రఘుపతి రెడ్డి, పరమటయ్య, మహేష్ గౌడ్, బికేఆర్, నరసింహ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.