అనన్య న్యూస్, మహబూబ్ నగర్: నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్తు యువత దేనని, ఉద్యోగాలు అవే వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ మెట్టుగడ్డ పిల్లల మరి రోడ్డులో ఉన్న బాలికల ఐటిఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్, శాంతనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల సర్టిఫికెట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కేటీఆర్ అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డబ్బులు చాలామందికి ఉండవచ్చు కానీ మంచి చేయాలని ఆలోచన రావడం గొప్ప విషయం అన్నారు. మోహన్ రెడ్డి ఇక్కడ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. మనుషులందరికీ భగవంతుడు ఒకేలా తెలివితేటలు ఇచ్చాడు కానీ దాన్ని వాడటంలో వారి ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు.
తెలంగాణలో ఆ రోజుల్లో రెడ్ టేప్ ప్రభుత్వం ఉంటే ఇవాళ రెడ్ కార్పెట్ ప్రభుత్వం ఉందన్నారు. ఇవాళ తెలంగాణ యువత గురుకుల పాఠశాలల నుంచి ఐఐఎం, ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగాలను యువత అందిపుచ్చుకోవాలి. విద్యార్థులు నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. అలా అందిపుచ్చుకుంటే ఎక్కడైనా బతకొచ్చు. నైపుణ్యాలు ఉన్న భయం వల్ల అనేక మంది విద్యార్థులు ఆగిపోతున్నారు. ఇవాళ ఏదైనా సందేహం వస్తే గూగుల్ ను అడుగుతున్నాం. విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం.
తెలంగాణ ఏం సాధించిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నాం. రూ. 56వేల కోట్ల వద్ద ఉన్న ఐటీ ఎగుమతులు రూ.2.40 లక్షల కోట్లకు చేరడం వాస్తవం కాదా. ఇవి నా లెక్కలు కావు. నాలుగు రేట్లు ఐటీ ఎగుమతులు పెరిగాయి. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇవాళ 9.05 లక్షలకు చేరింది.
హైదరాబాద్ మారిందని స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే హైదరాబాద్ లో ఉన్నామా.. లేక న్యయార్క్ ఉన్నామా అనే సందేహం కలుగుతుందన్నారు. 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం. 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు కాదా? 9 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్లామో ప్రజలు చూస్తున్నారు. విద్య, వైద్యం.. ఇలా అనేక రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాం. గత 9 ఏళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు మారాయా? లేదా? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు.