Saturday, February 15, 2025

నిరుద్యోగులకు శుభవార్త అందించిన సీఎం జగన్..

అనన్య న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి సర్కారు శుభవార్త అందించింది. గురువారం గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 1000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో 92 గ్రూప్‌-1 పోస్టులతోపాటు వేరే విభాగంలో ఏపీపీఎస్సీ 16 పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిది ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులున్నట్లు తెలిపింది. అలాగే సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ కింద కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌(గ్రేడ్‌-2) పోస్టులు ఎనిమిది భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular