అనన్య న్యూస్, హైదరాబాద్: ఎంసెట్ విద్యార్ధులకు కీలకమైన సమాచారమిది. ఇన్నాళ్లూ ఎంసెట్ ర్యాంకుల్లో అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ ఇకపై ఉండదు. గురువారం ఇంటర్ వెయిటేజ్ మార్కుల విధానాన్ని శాశ్వతంగా తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఇకపై ఉండదు. ఈ మేరకు వెయిటేజ్ మార్కుల విదానాన్ని శాశ్వతంగా తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మసీ రంగాల్లో ప్రవేశాలకు ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ అమలు చేస్తూ తొలిసారిగా ఈ నిర్ణయాన్ని 2011లో తీసుకున్నారు. ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ కేటాయించారు. ఈ రెండింటినీ కలిపి ర్యాంకు నిర్ణయించేవారు. ఈ విధానం వల్ల విద్యార్ధులు నష్టపోతున్నారనే వాదనలు పెరుగుతున్నాయి. దాంతో ఇంటర్ వెయిటేజ్ మార్కుల రద్దుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. అన్ని వర్గాలు, శాఖల్నించి సమాచారం తీసుకుని..వెయిటేజ్ మార్కుల విధానాన్ని రద్దు చేసింది.