అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అభ్యున్నతి కోసం కలిసి పని చేసేందుకు, కాంగ్రెస్ ను వీడిన వారందరూ తిరిగి రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ది గెలుపే కాదంటూ ప్రజాపాను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిజెపి, బిఆర్ఎస్ వేరువేరు కాదని మరోసారి ఆరోపించారు. కర్ణాటక ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు.
దాదాపు 40 ఏళ్ల తర్వాత కర్ణాటక ప్రజలు మోదీ కుట్రను తిప్పికొట్టి స్పష్టమైన తీర్పునిచ్చారని దీంతో ప్రజాస్వామ్య వాదులందరికొక విశ్వాసం, నమ్మకం వచ్చిందని, మోదీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. రేపు తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతోంది. ఎల్లుండి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది మళ్ళీ తిరిగి అక్కున చేర్చుకుంటుంది తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పునరీకరణ జరగాలి, ఇది ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోరిక ఆలోచన. పాటిన వీడిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్న కెసిఆర్ వ్యతిరేక పునరీ కరణలో భాగంగా అందరూ ముందుకు రావాలి, తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని ఆహ్వానిస్తున్న, కెసిఆర్ ను ఓడించడం బిజెపి వల్ల కాదు. కర్ణాటక ప్రభావం తెలంగాణలో ఉంటుంది అన్ని వర్గాలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాయి. కెసిఆర్ తప్ప దేశంలోని విపక్షాలు కాంగ్రెస్ రావాలని కోరుతున్నాయి అని రేవంత్ రెడ్డి అన్నారు.