అనన్య న్యూస్, హైదరాబాద్: భారత్ లో కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతుండడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వం టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. 5 లక్షల కార్బేవ్యాక్స్ టీకా డోసులను ప్రజలకు రాష్ట్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్న బూస్టర్ డోస్ గా కార్బేవ్యాక్స్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.