రంగుల్లో మునిగితేలిన యువత
జడ్చర్ల, అనన్య న్యూస్: జడ్చర్ల మున్సిపాలిటీ, మండల కేంద్రంలో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా యువకులు, చిన్నారులు, మహిళలు ఆనందోత్సవాల మధ్య సహజసిద్ధమైన రంగులు చల్లుకున్నారు. రంగులను ఒకరికి ఒకరు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో సోమవారం రాత్రి కాముడి దహనం చేశారు. బాదేపల్లి, జడ్చర్ల, కావేరమ్మ పేట, హౌసింగ్ బోర్డ్ కాలనీలో హోలీ వేడుకలను జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నేతాజీ చౌరస్తాలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలో మహిళలు, యువతి యువకులు, చిన్నారులు తమ తోటి మిత్రులతో కలిసి ఆనందంగా హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు.