అనన్య న్యూస్: సినిమా అనే రంగుల ప్రపంచంలో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్లలో ఒకరిగా కృతి శెట్టి పేరు చెప్పుకోవచ్చు. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి క్యూట్ లుక్స్ తో యువత మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అమ్మడి అందానికి ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. దీంతో ఒక్కసారిగా కృతి శెట్టి పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్స్ రావడంతో కృతి పేరు జనం నోళ్ళలో నానిపోయింది. ఉప్పెన తర్వాత నాని సరసన శ్యామ్ సింగ రాయ్, నాగ చైతన్య సరసన బంగార్రాజు సినిమాల్లో నటించి తన కెరీర్ గాడిలో పెట్టుకుంది కృతి. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రీసెంట్ గా మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ సినిమాల్లో నటించింది.