అనన్య న్యూస్, జడ్చర్ల: గతంలో ఆడ బిడ్డల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు భారంగా భావించేవారని తెలంగాణ ఏర్పడ్డాకా ఆ పరిస్థితి లేదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నేడు ఆడబిడ్డల తల్లిదండ్రులు దర్జాగా, చాలా ధీమాగా కళ్యాణ లక్ష్మి పథకం ఉందనే భరోసాతో ఉన్నారని అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చంద్ర గార్డెన్ లో జడ్చర్ల మున్సిపాలిటీ, మండలానికి సంబంధించి 350 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామాల్లో సుదీర్ఘంగా చర్చ జరపాలనీ, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన ప్రభుత్వానికి ప్రజలు ఉండగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మీ పథకంతో ఆడబిడ్డల తల్లిదండ్రుల్లో పెరిగిన ధీమా: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES