– ఆ జాబితాలో తెలంగాణ
అనన్య న్యూస్: దేశంలో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్స్ టైల్ 5ఎఫ్ (ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీటు ఫ్యాషన్ టు ఫారెన్) విజన్ కి అనుగుణంగా టెక్స్ టైల్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నానని వెల్లడించారు.
పీఎం మిత్రా మెగా టెక్స్ టైల్ పార్కులు టెక్స్ టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టు బడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ కి ఇదిగొప్ప ఉదాహరణ అని అన్నారు. ఆత్మ నిర్భర్ ప్లాన్ లో భాగంగా భారతీయ తయారీ దారులు ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎగుమతులను పెంచడానికి, భారత్ ను ప్రపంచ సప్లై చైన్ లో చేర్చడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని ప్రారంభించింది.
టెక్స్ టైల్స్ పరిశ్రమశ్ర కోసం ప్రపంచస్థాయిలో ధీటుగా మారడానికి రూ.10,683 కోట్ల ఆర్థిక వ్యయంతో పీఎల్ఐని ప్రారంభించింది. ఈ పథకం కింద టెక్స్ టైల్ పరిశ్రమలో ఇప్పటివరకు సుమారు రూ.1,536 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది.2027-28 వరకు రూ.4445 కోట్లతో ప్రపంచస్థాయిలో ఈ ఏడు రాష్ట్రాల్లో టెక్స్ టెక్స్ టైల్ పార్కులను అభివృద్ధి చేసేందుకు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్రా) పార్కులను
ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.