- 27న జడ్చర్లకు మంత్రి హరీష్ రావు రాక
అనన్య న్యూస్, జడ్చర్ల: ఈనెల 27న జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం వంద పడకల ఆసుపత్రిని సందర్శించి ప్రారంభానికి సిద్ధమవుతున్న అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 27న 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. రూ 33 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో డయాలసి సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మరో మూడు చోట్ల ఆరోగ్య కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్ దేశవాళీ సతీష్, వైద్యాధికారులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.