అనన్య న్యూస్, వనపర్తి: పట్టణ ప్రజలకు, రైతులకు అనువైన స్థలంలో ఏర్పాటు చేసిన సమీకృత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి లో నిర్మించిన సమీకృత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర వసతుల గురించి తెలుసుకున్నారు. మైనర్ పనులు పూర్తిచేసి త్వరగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహరెడ్డి, మార్కెటింగ్ అధికారి స్వరాన్ సింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.

